![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -482 లో.. శివన్నారాయణ కార్తీక్ చేతిలో అగ్రిమెంట్ పేపర్స్ పెట్టి ఇక్కడ నుండి వెళ్ళిపోమని అంటాడు. తప్పు చేసిన వాళ్ళని ఏం చెయ్యాలి జ్యోత్స్న అని శివన్నారాయణ అడుగగా మెడ పట్టుకొని బయటకు గెంటెయ్యలని జ్యోత్స్న అంటుంది. నోరు ముయ్ అని జ్యోత్స్న పై శివన్నారాయణ విరుచుకుపడుతాడు. పదకొండు కోట్ల నష్టం నుండి కాపాడాడు కార్తీక్ అని శివన్నారాయణ చెప్తుంటే అందరు షాక్ అవుతారు.
వేలంపాట నుండి జ్యోత్స్న ని వచ్చేలా చేసింది వాడు.. జ్యోత్స్నని ఎందుకు తప్పు పడుతున్నారని సుమిత్ర అడుగుతుంది. అసలేం జరిగిందో అందరికి చెప్పమని దశరథ్ తో శివన్నారాయణ అంటాడు. దాంతో వైరాకి దశరథ్ ఫోన్ చేస్తాడు. చివరి వరకు వేలంపాట పాడి నిన్ను నష్టాల్లో పారెద్దామనుకున్న టైమ్ కి నీ కూతురుకి ఫోన్ చేసి రప్పించావ్ కదా అని వైరా అంటాడు. అసలు ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చారని కాల్ చేయించింది కూడా జ్యోత్స్ననే.. కార్తీక్ ని అక్కడే ఉంచి వెళ్ళాము.. కార్తీక్ ఫోన్ చేసి అక్కడ జరుగుతుంది మొత్తం చెప్పాడని దశరథ్ అందరికి చెప్తాడు. ఇక ఏం చెయ్యాలో తెలియక ఫేక్ కాల్ చేసి జ్యోత్స్న బయటకు వచ్చేలా చేసానని కార్తీక్ అంటాడు. నీలాంటి వాడు ఇక్కడ పని వద్దు నీకు టాలెంట్ ఉందని శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్న మేడమ్ వద్దంటే వెళ్ళిపోతానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత కార్తీక్, దీప హ్యాపీగా ఫీల్ అవుతారు.
కార్తీక్ దగ్గరికి సుమిత్ర వచ్చి హాల్లోకి తీసుకొని వెళ్తుంది. నా చేతిలో చెయ్ వేసీ నిజం చెప్తానని మాటివ్వు అనగానే కార్తీక్ మాటిస్తాడు. అసలు నీకు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం వచ్చినా చేసుకోకుండా ఎందుకు ఉన్నావని సుమిత్ర అనగానే నీ కూతురు కోసమని కార్తీక్ అంటాడు. మొత్తం తర్వాత అర్థం అవుతుందని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత కార్తీక్, దీప కిచెన్ లోకి వెళ్ళిపోతారు. నిజం చెప్పావ్ బావ కానీ వాళ్ళకి అర్ధం కాలేదని దీప అంటుంది. అప్పుడే పారిజాతం, జ్యోత్స్న వస్తారు. నా కోసం ఎందుకు ఉన్నావని జ్యోత్స్న ఆడుగుతుంది. కూతురు అంటే నువ్వు కాదా ఏంటి అని కార్తీక్ అనగానే పారిజాతం, జ్యోత్స్న టెన్షన్ పడుతారు. నీకు బుద్ది చెప్పడానికి అని కార్తీక్ చెప్పి వెళ్ళిపోతాడు. పారిజాతం, జ్యోత్స్న కన్ఫ్యూషన్ లో ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |